: ప్రతిపక్షాలది కిచిడి కూటమి: ఎంపీ బాల్క సుమన్

సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీలు ప్రకటించడం రాజకీయ వ్యభిచారమే అవుతుందని, ప్రతిపక్షాలది కిచిడి కూటమి అని, ఈ ఎన్నికల్లో వారి పప్పులు ఉడకవని అన్నారు. సింగరేణి ఎన్నికలతో విపక్షాల పతనం ప్రారంభమవుతుందని అన్నారు. తెలంగాణలో రైతు సమన్వయ సమితులపై పిటిషనర్లకు కోర్టు చివాట్లు పెట్టినా, విపక్ష నేతలు సిగ్గు లేకుండా గవర్నర్ ను కలిశారని విమర్శించారు.

More Telugu News