: భారీ రేటుకి పవన్, త్రివిక్రమ్ సినిమా అమెరికా హక్కులు!
‘కాటమ రాయుడు’ సినిమా తరువాత సినీనటుడు పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రానికి ఇంకా పేరు కూడా ఖరారు కాలేదు.. అయినప్పటికీ అప్పుడే ఈ సినిమా హక్కులు భారీ రేటుకి అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమా అమెరికా థియేట్రికల్ హక్కులను బ్లూ స్కై సంస్థ 21 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న పవన్ కొత్త సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా బాక్సాఫీసుని కదిలిస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.