: రూ.1.22 లక్షలతో ఇంట్లోంచి పారిపోయి.. హైదరాబాద్‌లో బైక్‌పై చక్కర్లు కొడుతున్న బాలురు!
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో స్కూటీపై చక్కర్లు కొడుతోన్న ఇద్దరు 14 ఏళ్ల బాలురను పోలీసులు పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద 1.22 లక్షలు లభ్యమయ్యాయి. వారిద్దరి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి ఆధారంగా వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఈ ఇద్దరు బాలురు రాజమహేంద్రవరానికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు.. మూడు రోజుల క్రితం ఆ ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి పారిపోయినట్లు తెలుసుకున్నారు. ఆ బాలురు ఎందుకిలా పారిపోయి వచ్చారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, వారు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ కి స్కూటీపై
రావడం గమనార్హం.