: ఆ సూపర్ స్టార్ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయా!: మలయాళ హాస్యనటుడు అనూప్ చంద్రన్
నటి భావన అపహరణ, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కారణంగా తాను ఎన్నో సినీ అవకాశాలను కోల్పోయానని హాస్యనటుడు అనూప్ చంద్రన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా అనూప్ చంద్రన్ ని పోలీసులు విచారించగా ఆశ్చర్యకర విషయాలు బయటపెట్టాడు. దిలీప్ వల్ల తన సినీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఒక దశలో అయితే, సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలంటూ దిలీప్ తనను బెదిరించినట్టు చెప్పారు.
దిలీప్ మిమిక్రీ బాగోలేదని గతంలో తాను అన్నందుకు, చిత్ర పరిశ్రమ నుంచి శాశ్వతంగా తనను బయటకు నెట్టివేయాలని దిలీప్ చూశాడని, ఈ క్రమంలో చాలా అవకాశాలు పోగొట్టుకున్నానని చెప్పాడు. సినిమాల్లో నటించే అవకాశాలు తనకు ఎందుకు రావట్లేదో మొదట్లో అర్థం కాలేదని, అందుకు కారణం దిలీపే అన్న విషయం క్రమంగా తనకు తెలిసిందని పోలీసుల విచారణలో అనూప్ చంద్రన్ పేర్కొన్నాడు.