: వెంట పడొద్దని మొత్తుకున్నా వినలేదు... అందుకే చాందినీని చంపేశానన్న సాయికిరణ్ రెడ్డి


గడచిన మూడు సంవత్సరాలుగా చాందినీ జైన్, తాను ప్రేమించుకుంటున్నామని, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా మారగా, అది నచ్చక ఆరు నెలల నుంచి దూరం పెట్టానని, అయినా పదేపదే వెంట పడుతుంటే భరించలేకనే హత్య చేశానని సాయికిరణ్ రెడ్డి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. తన వెనుక పడవద్దని ఎంతగా చెప్పి చూసినా వినలేదని, తననే ప్రేమించాలని బెదిరింపులకు దిగేదని, ఈ పరిస్థితుల్లో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

హత్యకు ముందు కూడా తననిక వదిలేయాలని బతిమాలానని, అయినా వినకపోయేసరికి ఎలాగైనా నేటితో ఆమెను వదిలించుకోవాలన్న ఆగ్రహంతో హత్య చేశానని అంగీకరించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సాయికిరణ్ ఒక్కడే ఈ కేసులో నిందితుడని, చాందినీ స్నేహితులెవరికీ సంబంధం లేదని, ఆమెను హత్య చేసిన తరువాత చెరువులో పారేసిన ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసిన తరువాత తిరిగి మియాపూర్ స్టేషన్ కు తీసుకొచ్చామని చెప్పాయి. సాయికుమార్ రెడ్డిని నేడు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News