nara rohith: విలన్ మనసు దోచుకునే 'కథలో రాజకుమారి'!

మొదటి నుంచి కొత్తదనమున్న పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ నారా రోహిత్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కథలో రాజకుమారి' ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్ సూరపనేని మాట్లాడుతూ, ఈ సినిమాలో చాలా వరకూ నారా రోహిత్ విలన్ గానే కనిపిస్తాడని చెప్పారు.

అలాంటి విలన్ జీవితంలోకి 'కథలో రాజకుమారి'లా ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ అమ్మాయి ఆయనను మంచివాడిలా ఎలా మార్చిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని అన్నారు. రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన ఈ పాత్రకి నారా రోహిత్ జీవం పోశాడని చెప్పారు. ఆయన సరసన కథానాయికగా నమితా ప్రమోద్ నటించిందని అన్నారు. నాగశౌర్య సినిమా ఆర్టిస్టుగానే గెస్టు పాత్రలో కనిపిస్తాడనీ, మరో ముఖ్యమైన పాత్రలో నందితా రాజ్ నటించిందని చెప్పారు.    
nara rohith
namitha pramod

More Telugu News