: కొలిక్కి వచ్చిన కోతి సెల్ఫీ కాపీరైట్ వివాదం!
దంతాలు కనిపించేలా వెకిలిగా నవ్వుతూ ఓ బ్లాక్ ఏప్ తీసుకున్న సెల్ఫీకి సంబంధించిన కాపీరైట్ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. `నరుటో` అనే కోతి తీసుకున్న సెల్ఫీ అప్పట్లో ఇంటర్నెట్ సంచలనంగా నిలిచింది. అయితే ఈ కెమెరా యజమాని డేవిడ్ స్లేటర్‌కి కాకుండా, ఈ సెల్ఫీ మీద నరుటోకి కాపీరైట్ ఉంటుందని, దాని ఆదాయంపై హక్కుల కోసం వన్యప్రాణి సంరక్షణ సంస్థ (పెటా) న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ వివాదంలో ఫొటో ద్వారా సమకూరే ఆదాయంలో 25 శాతాన్ని ఇండోనేషియాలోని బ్లాక్ఏప్‌ల సంరక్షణ కోసం అందజేసేందుకు డేవిడ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇలా జంతువులకు కాపీరైట్ కల్పించడంలో తమ కృషి ఫలించినందుకు పెటా ఆనందం వ్యక్తం చేసింది. నిజానికి ఫొటో మీద వంద శాతం హక్కులు నరుటోకే ఉంటాయని అభిప్రాయపడింది.