: చంకలో ఉన్నది ఎలుగుబంటి పిల్లా? హార్దిక్ పాండ్యానా?: పరిణీతి ఫోటోపై వ్యంగ్య కామెంట్లు

క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని హీరోయిన్ పరిణీతి చోప్రా నెత్తీ నోరు మొత్తుకుని చెబుతున్నా నెటిజన్లు మాత్రం వినట్లేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆమె, అక్కడ పెరిగే ఓ రకం ఎలుగుబంటి (కోలా) పిల్లను చంకలో ఎత్తుకుని ఫొటో దిగి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా, ఎంతో మంది వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. చంకలో ఉన్నది కోలానా? లేక హార్దిక్ పాండ్యానా? అని ఎద్దేవా చేస్తున్నారు. పరిణీతి ముఖం కూడా కోలా ముఖంలానే ఉందని, ఇప్పటికైనా డైటింగ్ చేయడం మానేసి కొంత లావు కావాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ తరహా వ్యాఖ్యలను ఆమె ముందు ప్రస్తావిస్తే, ఇటువంటి కామెంట్లను చూసి నవ్వుకుంటానని చెప్పే పరిణీతి తాజా 'కోలా' కామెంట్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Telugu News