vijay setupathi: లేడీ గెటప్ లో అదరగొట్టేస్తోన్న స్టార్ హీరో!

షార్ట్స్‌లో చూడండి
కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ఈ మధ్యకాలంలోనే విజయ్ సేతుపతి చేరిపోయాడు. అందుకు కారణం ఆయన ఎంచుకుంటూ వచ్చిన వైవిధ్యభరితమైన పాత్రలే. అదే పద్ధతిని ఆయన తాజా చిత్రం విషయంలోను అనుసరించాడు. ప్రస్తుతం ఆయన 'సూపర్ డీలక్స్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో 'శిల్ప' అనే లేడీ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.

ఈ వార్త బయటికి వచ్చినప్పుడు కోలీవుడ్ జనాలు ఆశ్చర్యపోయారు. చాలా రఫ్ లుక్ తో కనిపించే విజయ్ సేతుపతి, లేడీ గెటప్ లో నప్పడేమోనని అనుకున్నారు. కానీ అందుకు సంబంధించిన లుక్ తాజాగా బయటికి రావడంతో మరింత షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ .. శివ కార్తికేయన్ లు లేడీ గెటప్ లు వేసి మెప్పించారు. విజయ్ సేతుపతి కూడా లేడీ పాత్రలో అదరగొట్టేయడం ఖాయమని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.  
Go Back to Shorts
vijay setupathi

More Telugu News