: భారత్‌లో కోట్లు కొల్లగొడుతున్న దెయ్యం సినిమా `ఇట్`!
ప్రముఖ ఆంగ్ల రచయిత స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా తెరకెక్కిన `ఇట్` సినిమా భారతదేశ మార్కెట్‌లో కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 11 కోట్లకి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డెంజిల్ డయాస్ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి ఆండీ మూషెట్ దర్శకత్వం వహించారు. అమెరికాలో కూడా ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటివరకు 117.2 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు సమాచారం. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ మొత్తంలో ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మొదటి హార్రర్ చిత్రంగా `ఇట్` నిలిచింది.