: మైకేల్ జాక్సన్ పాటకు స్టెప్పులేసిన అలీబాబా స్థాపకుడు జాక్ మా... వీడియో చూడండి!
ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, తన కంపెనీ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్యాన్స్ చేశారు. మైకేల్ జాక్సన్ వస్త్రధారణలోనే `డేంజరస్` పాటకు జాక్ మా స్టెప్పులేసి తన ఉద్యోగులను అలరించారు. అంతేకాకుండా చివర్లో స్టేజీ మీద బైక్‌తో విన్యాసాలు కూడా చేశారు. గతంలో అలీబాబా కంపెనీ 10వ వార్షికోత్సవం సందర్భంగా కూడా జాక్ మా తన గొంతు సవరించుకుని, పాట పాడారు. నాటకాలు, కళల మీద ఆసక్తి ఉన్న జాక్ మా, అలీబాబా కంపెనీ స్థాపించడానికి ముందు కూడా కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు.