: బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్నీ ఇవ్వ‌బోము: చైనా


భార‌త్‌పై చైనా మ‌ళ్లీ త‌న బుద్ధిని బ‌య‌ట‌పెట్టింది. భారత్‌తో చర్చలు జరిపేందుకు తామెప్పుడూ సిద్ధ‌మేన‌ని అంటూనే బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే ఇటీవ‌ల త‌లెత్తి, ముగిసిన డోక్లామ్ ప్ర‌తిష్టంభ‌న నేప‌థ్యంలో సిక్కిం సరిహద్దులో మూసేసిన నాథూలా పాస్‌ను తిరిగి తెరిపించేందుకు తాము సిద్ధమని చైనా తెలిపింది. కైలాస్‌, మానస సరోవర యాత్ర చేసే భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పింది. ఈ విష‌యంలో భారత్‌ ముందుకు వస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొంది.   

  • Loading...

More Telugu News