: న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా వాడుకోవాలని చూస్తున్నారా?: గుత్తా సుఖేందర్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం


గతంలో ఓ పిటిషన్ వేసి, ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంటామని చెప్పిన టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వ సలహాదారుల నియామకాన్ని సవాల్ చేస్తూ గుత్తా ఓ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై కోర్టు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు ఆ పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు గుత్తా తరఫు న్యాయవాది కోర్టులో మరో పిటిషన్ వేయగా, న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా వాడుకోవాలని చూస్తున్నారా? అంటూ న్యాయమూర్తి చివాట్లు పెట్టారు. పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతించేది లేదని, విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీరు వెనక్కి తగ్గినా, తాను మాత్రం విచారణను ఆపబోనని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News