nagababu: మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే .. చీలిక లేదు!: నాగబాబు

షార్ట్స్‌లో చూడండి
మెగా ఫ్యామిలీ సినిమా ఫంక్షన్స్ కి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. అయితే ఒకసారి ''చెప్పను బ్రదర్'' అంటూ పవన్ అభిమానుల పట్ల అల్లు అర్జున్ అసహనాన్ని ప్రదర్శిస్తే, మరోసారి .. ఫంక్షన్ కి పవన్ ఎందుకు రాలేదంటూ గోల చేస్తోన్న ఫ్యాన్స్ కి నాగబాబు కాస్త కోపంగానే సమాధానం ఇచ్చారు. ఆ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో నాగబాబు స్పందించారు.

 "చెప్పను బ్రదర్ " అంటూ బన్నీ కాస్త తొందరపడినా .. ఆ వెంటనే సరిదిద్దుకుని మాట్లాడాడని అన్నారు. ఇక తాను పవన్ అభిమానులందరినీ ఉద్దేశించి అసహనాన్ని వ్యక్తం చేయలేదనీ, అక్కడ గోల చేస్తోన్న వారిలో కొందరిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని చెప్పారు. చిరూ .. పవన్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. ఇలా ఎవరి ఫ్యాన్స్ వారికి వున్నా, అందరూ అందరి సినిమాలను చూస్తూనే ఉంటారని అన్నారు. అందుకే వాళ్లందరినీ తాను మెగా ఫ్యాన్స్ గానే భావిస్తూ ఉంటాననీ, వాళ్లలో ఎలాంటి చీలిక లేదని చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
nagababu

More Telugu News