: తారల వయసు బయటపెడుతోందని ఐఎండీబీ వెబ్‌సైట్‌పై పిటిషన్ వేసిన నటుల సంఘం
హాలీవుడ్ సినీతారల అసలు వయసు బయటపెట్టడాన్ని ఖండిస్తూ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)పై నటుల సంఘం స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (ఎస్ఏజీ) కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ వేసింది. సినీ ప్రపంచంలో నిజమైన వయసు బయటపెట్టడం వల్ల అవకాశాలు తగ్గుతున్నాయని ఎస్ఏజీ పేర్కొంది. నటనలో ఎంత ప్రావీణ్యం ఉన్నా వయసు విషయానికి వచ్చేసరికి చాలా మంది మహిళా నటీమణులు ఇబ్బందులు ఎదుర్కుంలున్నారని పిటిషన్‌లో పేర్కొంది.
తనకు కీలక పాత్రలు చేసే అవకాశం రావడం లేదని, అందుకు ఐఎండీబీ తన వయసును ప్రకటించడం వల్లేనని నటి జూనీ హొవాంగ్ ఎస్ఏజీకి ఫిర్యాదు చేసింది. తనకు కలిగించిన నష్టానికి ఐఎండీబీ నుంచి ఒక మిలియన్ డాలర్ల నష్టపరిహారం వచ్చేలా చేయాలని ఆమె ఎస్ఏజీని కోరింది. ఆమె కోరిక మేరకు నటుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.