: అమెరికా చరిత్రలో ఈ రెండు తుపాన్లే అంత్యంత భారీ నష్టాన్ని మిగిల్చాయి


అమెరికా చరిత్రలో రెండు తుపాన్లు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఒకటి 25 ఏళ్ల క్రితం 1992 ఆగస్టులో వచ్చిన ఆండ్రూస్‌ తుపాను కాగా, రెండోది ఇప్పుడు సంభవించిన ఇర్మా తుపాను. అప్పట్లో సంభవించిన ఆండ్రూస్ తుపాను ఫ్లోరిడా, బహమాస్ దీవులను అతలాకుతలం చేసింది. కేటగిరీ 5 తుపానుగా పేర్కొనే ఆండ్రూస్ ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు 65 మంది ప్రాణాలుతీయగా, 63,500 ఇళ్లను ధ్వంసం చేసి, 26.5 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని మిగిల్చాయి.

దీని తరువాత అమెరికా చరిత్రలో అంతపెద్ద తుపాను రాలేదు. 25 ఏళ్ల తరువాత సంభవించిన ఇర్మా తుపాను, కరీబియన్ దీవులతో పాటు ఫ్లోరిడాను అతలాకుతలం చేసింది. మయామీలో ఎమర్జెన్సీ విధించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని, పది అడుగుల ఎత్తులో మాత్రం ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 65,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 20,00,000 మంది ప్రజలు చిమ్మచీకట్లలో కాలం వెళ్లదీస్తున్నారు. తుపాను వచ్చే ప్రదేశాల్లోని జైళ్లలో జూలలోని జంతువులను ఉంచారు. ఖైదీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

  • Loading...

More Telugu News