udayabhanu: హుషారెత్తించడానికి మళ్లీ ఉదయభాను వచ్చేస్తోంది!

ఒకప్పుడు 'హృదయాంజలి' పేరుతో ఈటీవీ చానల్లో మొదలైన ప్రోగ్రామ్ తో ఉదయభాను కుర్రకారు ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది. ఆ తరువాత ఆమె ఎన్నో కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరించింది. హోస్ట్ గా సినిమా ఫంక్షన్స్ ను ఎంతో ఉత్సాహభరితంగా నడిపించింది. ఆ తరువాత ఉదయభానుకు వివాహం జరగడం .. ఆమెకు ట్విన్స్ జన్మించడం జరిగింది. ఇటీవలే ఆ ట్విన్స్ ఫస్టు బర్త్ డే వేడుకను జరిపింది కూడా.

అలాంటి ఉదయభాను బుల్లితెర ప్రేక్షకులను హుషారెత్తించడానికి మళ్లీ రంగంలోకి దిగుతోంది. స్టార్ మా నిర్వహించే 'నీ తోనే' అనే డాన్స్ షోలో ఆమె కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'భాను ఈజ్ బ్యాక్' అంటూ స్టార్ మా వారు వదిలిన వీడియో బిట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ కార్యక్రమంలో ఉదయభాను చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.    
udayabhanu

More Telugu News