: నితీష్ కుమార్ కి అధికార యావ ఎక్కువ: లాలూ ప్రసాద్ యాదవ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మిత్ర ధర్మాన్ని పక్కనబెట్టి బీజేపీతో జట్టు కట్టిన నాటి నుంచి ఆయనపై లాలూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, నితీశ్ కుమార్ వ్యక్తిత్వం గురించి తనకు బాగా తెలుసని అన్నారు. నితీశ్ కుమార్ ఊసరవెల్లిలా తరచు రంగులు మారుస్తుంటారని విమర్శించారు.
అధికారం మీద ఆయనకు యావ ఎక్కువని లయూ అన్నారు. తనకు పుత్రవాత్సల్యం ఎక్కవని ఆయన ఆరోపిస్తున్నారని, అదే నిజమైతే, తనకే పుత్ర వ్యామోహం ఉంటే...ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ఆయన ప్రశ్నించారు. జేడీయూ కంటే ఆర్జేడీ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఆయనను సీఎంను చేశానని ఆయన తెలిపారు.