nagababu: ప్రభాస్ .. మహేశ్ .. ఎన్టీఆర్ అంటే ఇష్టం : నాగబాబు

షార్ట్స్‌లో చూడండి
మెగా ఫ్యామిలీ హీరోలుగా పవన్ కల్యాణ్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. అల్లు శిరీష్ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు కాకుండా బయట హీరోల్లో మీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారనే ప్రశ్న నాగబాబుకు ఎదురైంది. ఈ ప్రశ్నకి ఆయన తనదైన శైలిలో స్పందించారు.

 మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. ప్రభాస్ అంటే తనకి ఎంతో ఇష్టమని నాగబాబు అన్నారు. హీరోలుగా వాళ్లు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతగా శ్రమించారనేది తనకి తెలుసని చెప్పారు. అభిమానులను అలరించడం కోసం వాళ్లు చేస్తోన్న నిరంతర సాధన వాళ్లను ఈ స్థాయికి చేర్చిందని అన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలైనా .. బయట హీరోలైనా ఎవరి హార్డ్ వర్క్ తో వాళ్లు నిలబడ్డారని చెప్పారు. వాళ్లలో వర్త్ ఉండబట్టే లక్షలాదిమంది అభిమానిస్తున్నారనీ,  నిర్మాతలు కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారని అన్నారు. ఎవరినైనా విమర్శించడం చాలా తేలికనీ, వాళ్ల టాలెంట్ ను గుర్తించడమే కష్టమని చెప్పుకొచ్చారు.  
Go Back to Shorts
nagababu

More Telugu News