: ఐటం సాంగ్ ఆర్టిస్ట్ ఇంత లావుగానా?... శిల్పా షిండేపై నెటిజన్ల తిట్లు!
పాప్యులర్ అయిన వెబ్ సిరీస్ 'బాభీజీ ఘర్ పర్ హై'తో గుర్తింపు తెచ్చుకున్న శిల్పా షిండే, తాజాగా 'పటేల్ కీ షంజాబీ షాదీ' చిత్రంలో 'మారో లైన్' అనే ఐటమ్ సాంగ్ లో డ్యాన్స్ చేయగా, ఇటీవల నిర్మాతలు దాన్ని యూ ట్యూబ్ లో విడుదల చేశారు. ఇక ఈ పాటను చూసిన వారంతా, శిల్పా షిండే చాలా లావుగా ఉందని, అసలు ఈ పాటకు అంత లావుగా ఉన్న నటిని తీసుకోవడం ఏంటని తిట్ల దండకానికి దిగారు.
ఆమె స్టెప్పులు బాగాలేవని, దుస్తులు ఇంకెంత మాత్రం నప్పలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. రిషి కపూర్, పరేష్ రావెల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ వారంలో విడుదలకు సిద్ధమైంది. కాగా, గతంలో నిర్మాత సంజయ్ కోహ్లీ తనను లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసి శిల్పా షిండే వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆ ఐటమ్ సాంగ్ వీడియోను మీరూ చూడవచ్చు.