: ఇర్మా తొలి ప్రభావంపై యూఎస్ నేషనల్ వెదర్ సర్వీసెస్ ప్రకటన


ఫ్లోరిడా తీరాన్ని ఇర్మా తుపాను తాకిందని అమెరికా జాతీయ వాతావరణ సేవల సంస్థ ప్రకటించింది. కీస్ ప్రాంతంలో గంటకు 119 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 193 కిలోమీటర్ల వరకూ పెరుగుతుందని పేర్కొంది. భారీ వర్షం మొదలైందని, ఈ వర్షం కనీసం 12 గంటల పాటు పడుతుందని హెచ్చరించింది. సముద్రపు అలలు 15 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతున్నాయని తెలిపింది.

50 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని, సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు వెళ్లనివారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బంకర్లు ఏర్పాటు చేసుకున్న వారు, వాటిల్లోనే తలదాచుకోవాలని సూచించింది. కాగా, ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లోని 76 వేల మంది కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని, తుపాను ప్రభావం తగ్గగానే, ముమ్మరంగా సహాయక చర్యలు చేపడతామని అన్నారు. ఈ రాత్రి గడవడం చాలా ముఖ్యమని అన్నారు. ఈ తుపాను ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైనదని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News