: ఇసుక అక్రమ రవాణాను నియంత్రించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు
ఇసుక అక్రమ రవాణాను నియంత్రించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చంద్రబాబు ఇసుక అక్రమ రవాణా గురించి ప్రస్తావించారు. ఈ అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని అన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై టాడా చట్టం కింద కేసులు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని సూచించారు. ఇసుక రీచుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.