: టేకాఫ్ కాగానే పొగలు.. పైలట్ చాకచక్యంతో తప్పిన విమాన ప్రమాదం


కోల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో పొగ‌లు వ‌చ్చిన ఘ‌ట‌న కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఈ విష‌యాన్ని పైలట్ గ‌మ‌నించి విమానాన్ని రన్‌వేపై నిలిపి వేయ‌డంతో ఘోర ప్ర‌మాదం త‌ప్పింద‌ని సంబంధిత అధికారులు చెప్పారు. ఆ విమానం రాయల్‌ భూటాన్‌ ఎయిర్‌లైన్స్ సంస్థ‌కు చెందింద‌ని, ర‌న్‌వేపై దాన్ని నిలిపివేయ‌గానే వెంటనే ప్రయాణికులందరినీ క్షేమంగా దించేశామ‌ని అన్నారు. విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది పొగలను అదుపు చేశార‌ని తెలిపారు. ఈ ప్రమాదం ఎందుకు జ‌రిగింద‌న్న విష‌యంపై స‌మాచారం అందాల్సి ఉంది.      

  • Loading...

More Telugu News