: మిథాలీ రాజ్ కు మద్దతు పలికిన క్రికెటర్ రాబిన్ ఉతప్ప


భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ వేసుకున్న డ్రెస్ పై ఇటీవల ట్విట్టర్లో పెద్ద వివాదమే నడిచింది. ఆమె వస్త్రధారణను పలువును నెటిజన్లు విమర్శించారు. మరోవైపు ఎంతో మంది మిథాలీకి అండగా నిలిచారు. ఈ క్రమంలో మిథాలీకి టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప మద్దతుగా నిలిచారు. మిథాలీ వేసుకున్న డ్రెస్ ను తప్పుబడుతున్నవారంతా 'సిల్లీ మైండ్స్' అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికీ కొంతమంది భారతీయులు పాత పద్ధతుల్లోనే ఉండిపోయారని ఎద్దేవా చేశాడు. మోరల్ పోలీసింగ్ చేయడాన్ని మానుకోవాలని సూచించాడు. 

  • Loading...

More Telugu News