raj tarun: యంగ్ హీరోతో రంగంలోకి 'గుండెజారి గల్లంతయ్యిందే' దర్శకుడు

'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాతో ప్రేమకథల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించిన విజయ్ కుమార్ కొండా, మరో ప్రేమకథను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. వైవిధ్యభరితమైన ఒక ప్రేమకథను సిద్ధం చేసుకుని ఇటీవలే రాజ్ తరుణ్ కి వినిపించాడట. కథలోని కొత్తదనం కారణంగా వెంటనే రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

 కెరియర్ ఆరంభం నుంచి కూడా ప్రేమకథలతోనే యూత్ ను ఎక్కువగా రాజ్ తరుణ్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తోన్న రెండు సినిమాలు సెట్స్ పై వున్నాయి. అవి పూర్తి కాగానే అక్టోబర్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం కథానాయిక అన్వేషణ జరుగుతోందట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.     
raj tarun

More Telugu News