: జావీద్ హ‌బీబ్ సెలూన్‌పై హిందూ జాగ్ర‌న్ మంచ్ కార్య‌క‌ర్త‌ల దాడి!


త‌న సెలూన్ ప్ర‌చారం కోసం హిందూ దేవుళ్లను ఉప‌యోగిస్తూ కోల్‌క‌తాలోని జావీద్ హ‌బీబ్ సెలూన్‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మండిప‌డుతూ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో మోతీన‌గ‌ర్ వ‌ద్ద ఉన్న జావీద్ హ‌బీబ్ సెలూన్‌పై హిందూ జాగ్ర‌న్ మంచ్ కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. సెలూన్‌కి వ‌చ్చిన వారిని లోప‌లే ఉంచి బ‌య‌టి నుంచి తాళం వేశారు. త‌ర్వాత సెలూన్ అద్దాల‌ను ప‌గుల‌గొట్టి, యాజ‌మాన్యాన్ని హెచ్చ‌రించారు. సెలూన్‌ను మూసివేయాల‌ని గొడ‌వ చేశారు. పోలీసులు వ‌చ్చి గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణిగేలా చేశారు. హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచిన జావీద్ హ‌బీబ్ సెలూన్ల‌ను మూసివేసేదాక గొడ‌వ చేస్తామ‌ని హిందూ జాగ్ర‌న్ మంచ్ ప్రాంతీయ కార్య‌ద‌ర్శి విమ‌ల్ ద్వివేది తెలిపారు. `దేవుళ్లు కూడా మేక‌ప్ కోసం మా ద‌గ్గ‌రికే వ‌స్తారు` అంటూ జావీద్ హ‌బీబ్ కోల్‌క‌తా శాఖ వారు ప‌త్రికా ప్ర‌క‌ట‌న వేయించారు. దీనిపై విమ‌ర్శల దాడి ఎక్కువవడంతో ఆ వెంటనే జావీద్ హ‌బీబ్ స్వయంగా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు.

  • Loading...

More Telugu News