nani: మణిరత్నం మూవీలో చేయాలనే నాని కల నిజం కాబోతోంది!

షార్ట్స్‌లో చూడండి
దర్శకుడిగా జయాపజయాలకు అతీతమైన పేరు ప్రతిష్ఠలు మణిరత్నం సొంతం. ఆయన నుంచి వచ్చిన సినిమాలు పరాజయం పాలైనా, ఆ తరువాత సినిమాపై ఆడియన్స్ లో ఎంత మాత్రం ఆసక్తి తగ్గదు. అలా ఆయన విభిన్నమైన కథాంశాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు.

 కొత్తగా ఆయన ఒక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా కోసం ఆయన జ్యోతిక .. ఐశ్వర్య రాజేశ్ లను ఎంపిక చేశారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా టీమ్ నానీని సంప్రదించినట్టు సమాచారం. మణిరత్నం సినిమాలో నటించాలనేది తన కల అని చాలా సందర్భాల్లో నాని చెప్పాడు. అందువలన ఆయన ఎంత మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే నాని కల .. నిజం కాబోతోందన్న మాట. 
Go Back to Shorts
nani

More Telugu News