sandeep reddy: నాతో మహేశ్ సినిమా చేస్తానన్నాడు : 'అర్జున్ రెడ్డి' దర్శకుడు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' .. విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయ విహారం చేస్తోంది. ఇప్పటికే 30 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, 50 కోట్లవరకూ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.

 ఈ సినిమా చూసిన తరువాత తనకి ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు ఫోన్ చేసి అభినందించారని అన్నాడు. ముఖ్యంగా మహేశ్ బాబు ఫోన్ చేసి అభినందించడం తనకి ఎంతో ఆనందంగా అనిపించిందని అన్నాడు. వీలు చూసుకుని ఒక సినిమా చేద్దామని మహేశ్ బాబు అనడం తనని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పాడు. మహేశ్ బాబుతో సినిమా చేయాలనే కోరిక తనకి ఎప్పటి నుంచో ఉందనీ, ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. 
sandeep reddy

More Telugu News