: చైనాతో కలిసి నిర్మించిన అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన పాకిస్థాన్!


చైనాతో కలిసి నిర్మించిన ఐదో అణు విద్యుత్ కేంద్రాన్ని పాకిస్థాన్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌తో దేశం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి చెక్ పడుతుందని భావిస్తున్నారు. రాజధాని ఇస్లామాబాద్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు. చాష్మా-4 పేరుతో నిర్మించిన ఈ ప్లాంట్‌కు 340 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. పాకిస్థాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ (పీఏఈసీ), చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ (సీఎన్ఎన్‌సీ) కలిపి ఈ ప్లాంట్‌ను నిర్మించాయి.

గతేడాది డిసెంబరులో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగో అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా దేశంలోని దాదాపు 20 కోట్ల మందికి సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఆపసోపాలు పడుతోంది. ఈ సమస్యను 2018 నాటికి అధిగమించాలని అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ భావించి అణువిద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి తెరతీశారు. 

  • Loading...

More Telugu News