: బైక్ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన హార్లే డేవిడ్‌సన్ ధరలు


బైక్ ప్రియులకు ఇది శుభవార్తే. హార్లే డేవిడ్ సన్ తన బైక్ ధరలను భారీగా తగ్గించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రకటించింది. ఏకంగా ఒక్కో బైక్‌పై రూ.2.5 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా 2017 ఎడిషన్‌కు చెందిన ఫ్యాట్ బాయ్, హెరిటేజ్  సాఫ్‌టైల్ క్లాసిక్ మోడల్ ధరలను తగ్గించింది. తగ్గిన ధరల ప్రకారం.. ఫ్యాట్ బాయ్ ధర రూ.2 లక్షల మేర తగ్గి రూ.14,99,990కి చేరుకుంది. హెరిటేజ్ సాఫ్‌టైల్ క్లాసిక్ మోడల్ ధర రూ.18.50 లక్షల నుంచి రూ.15,99,990కి తగ్గింది. 2017 మోడల్ అన్ని బైకులకు ఈ తగ్గింపు వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. ఈ నెల నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వచ్చినట్టు వివరించింది.

  • Loading...

More Telugu News