: అంబులెన్స్ లను ఆపొద్దు: పోలీసులకు ఏపీ డీజీపీ ఆదేశాలు


ప్రముఖులు వెళ్లే మార్గాల్లో అంబులెన్సుల రాకపోకల అనుమతిపై ఏపీ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్న వారిని తరలించేందుకు వీలుగా అంబులెన్స్ లకు దారి ఇవ్వాలని, వాటిని కనుక ఆపితే పోలీసులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రముఖులు వస్తోన్న సమయంలో వాహనాలు ఆపి, అంబులెన్స్ లను పంపాలని, రహదారులపై వాటిని ఆపొద్దని జిల్లా ఎస్పీలను ఈ మేరకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News