: జలసిరిపై చంద్రబాబు పాటలు రాయమన్నారు: సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన జ‌ల‌సిరికి హార‌తి కార్య‌క్ర‌మంపై సినీ గేయ రచ‌యిత అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. ఈ పాట‌ల‌కు వందేమాతరం శ్రీనివాస్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఈ సంద‌ర్భంగా క‌డ‌ప‌కు వ‌చ్చిన అనంత శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే ఒకపాట పూర్తి చేశానని తెలిపారు. చంద్రబాబు అదేశాల మేరకు ఈ పాటలు రాస్తున్నానని తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పాటలు రాసే అవకాశం తనకు లభించడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో తనను కూడా భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని అన్నారు.   

  • Loading...

More Telugu News