: జగన్‌కు తెలిసింది ఆ ఒక్కటే!: టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు మిగిలించడం (వర్షపు నీటిని ఒడిసి పట్టడం) వంటి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. అయితే, జగన్‌కు మాత్రం ధనం ఏ రకంగా మిగిలించాలనే విషయం ఒక్కటే తెలుసని ఎద్దేవా చేశారు. జగన్‌కి, ఆయన పార్టీ నేతలకు ధనం గురించి తప్పా జనం విలువ తెలియదని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. మిగిలిన వాటి గురించి జగన్‌కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పలేదని చురకలంటించారు. ప్రభుత్వం చేపడుతోన్న ఇంకుడు గుంటలు, నదుల అనుసంధానం వంటి వాటిపై జగన్‌కు అవగాహన లేదని విమర్శించారు.