: సచిన్ అంకుల్.. మీ సినిమా చూసి నవ్వాను, ఏడ్చాను!’: క్రికెట్ లెజండ్ కు ఓ చిన్నారి లేఖ

‘క్రికెట్ లెజెండ్’, ‘క్రికెట్ దేవుడు’.. సచిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ సినిమా సచిన్ అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన అభిమానులు సచిన్ కు పలు సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపారు. అయితే, ఆ అభినందనల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి నిదర్శనం ఆరేళ్ల చిన్నారి రాసిన ఓ లేఖ.

ఆ లేఖలో ఆ చిన్నారి... ‘డియర్ సచిన్ అంకుల్, మై నేమ్ ఈజ్ తార ('సార' దీదీలా). కానీ, నాకు ఆరేళ్ల వయసు. ఈ మధ్యనే మీ సినిమా చూశా.. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూసి నేను నవ్వుకున్నా. ఎందుకంటే, చిన్నప్పుడు మీరు ఎంత అల్లరి పిల్లవాడోనని! నేను ఏడ్చాను..ఎప్పుడంటే.. మీ చివరి మ్యాచ్ చూసి. సచిన్ అంకుల్.. మిమ్మల్ని, సారా దీదీని, అర్జున్ భాయ్ ని, అంజలి ఆంటీని కలవాలని కోరుకుంటున్నాను. దయచేసి నేను కలవొచ్చా’ అని ఆ లేఖలో చిన్నారి తార కోరింది. ఇందుకు స్పందించిన సచిన్, ‘హాయ్, తార!  నాకు ఈ లేఖ రాసినందుకు చాలా కృతఙ్ఞతలు.. ఈ సినిమా చూసి నువ్వు సంతోషపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కీప్ స్మైలింగ్ :)’ అని సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News