: జగన్ మోసం చేసినట్టు మా వద్ద ఆధారాలున్నాయి: నాంపల్లి కోర్టులో సీబీఐ వాదన
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కేసుల్లో ఏ2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టు విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా రాంకీ, వాన్ పిక్, జగతి పబ్లికేషన్ ల పెట్టుబడుల ఛార్జ్ షీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ కోర్టును జగన్ కోరారు. అయితే, జగన్ విజ్ఞప్తికి సీబీఐ అడ్డుకట్ట వేసింది. పెట్టుబడిదారులను జగన్ మోసం చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపింది. జగన్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ నేపథ్యంలో, తదుపరి విచారణను అక్టోబర్ 6కు జడ్జి వాయిదా వేశారు.