: పాకిస్థాన్‌తో మా బంధం తెగదు.. ఆ దేశం ఎన్నో త్యాగాలు చేసింది: చైనా


చైనా మ‌ళ్లీ పాత పాటే పాడింది. ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోన్న దేశాల‌పై క‌ఠిన వైఖ‌రి అవ‌లంబించాల‌ని ఇటీవ‌ల జ‌రిగిన బ్రిక్స్ స‌మావేశంలో ఐదు దేశాల అగ్ర‌నేత‌లు తీర్మానం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోన్న‌ పాకిస్థాన్‌తో చైనా దోస్తీ చేస్తుండ‌డంతో వారి బంధానికి బీట‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావించారు. కానీ, చైనా మాత్రం త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. పాకిస్థాన్‌లోని చైనా రాయబారి సున్‌ వీడాంగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌కు సంబంధించినంత వరకు చైనా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్ప‌ష్టం చేశారు.

ప్రాంతీయ లక్ష్యాలను ఎదుర్కోవడంలో ఇరుదేశాల మధ్య పరస్పర మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. అంతేగాక‌, బ్రిక్స్‌ తీర్మానంలో ప్రస్తావించిన ఉగ్రవాద సంస్థలన్నింటిపైన పాకిస్థాన్ ఇప్పటికే నిషేధం విధించింద‌ని చెప్పారు. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాడటంలో పాక్‌ చేసిన త్యాగం చాలా గొప్ప‌ద‌ని అభ‌వర్ణించారు. అంతేగాక‌, పాక్ త్యాగాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని తరిమికొట్టడంలో ఆ దేశం పోషిస్తోన్న పాత్ర ఎంతో గొప్ప‌ద‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News