: విభజన సమయంలో భయపడ్డా, ఆయన ఉన్నారనే నమ్మకం ఉండేది: మంత్రి హరీష్ రావు
రాష్ట్ర విభజన సమయంలో కొంత భయమున్నప్పటికీ, రాజా సదారాం ఉన్నారనే నమ్మకం తమకు ఉండేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం గౌరవ సన్మాన కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు సమయంలో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. నలుగురు సీఎంల వద్ద ఆయన పని చేశారని, ఆయన సేవలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఈ సందర్భంగా హరీష్ పేర్కొన్నారు.