: చంద్రబాబుకు రాజీనామా లేఖను సమర్పించనున్న చమన్!
పరిటాల రవి ముఖ్య అనుచరుడు, అనంతపురం జిల్లాపరిషత్ ఛైర్మన్ చమన్ నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉవరకొండలో చంద్రబాబుకు చమన్ రాజీనామా లేఖను ఇవ్వనున్నారు.
జడ్పీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారమే ఆయన రాజీనామా చేయనున్నారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ గా నాగరాజు కొనసాగుతారు. గత కొంత కాలంగా ఛైర్మన్ పదవిపై కొంచెం హంగామా నడిచింది. రాజీనామా అనంతరం చమన్ ను అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మన్ గా చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.