: యువరాజ్ సింగ్ కెరియర్ ఇక ముగిసినట్టే!


అద్భుతమైన ఆట తీరుతో భారత్ కు ఒంటి చేత్తో ఘన విజయాలను అందించిన డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ కెరియర్ ముగిసినట్టే కనపడుతోంది. శ్రీలంకతో జరిగిన సిరీస్ లో ఆడిన జట్టునే ఒకటి, రెండు మార్పులతో ఆస్ట్రేలియా సిరీస్ కు కొనసాగిస్తామని సెలక్టర్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు పింక్ బాల్ తో డేనైట్ మ్యాచ్ లను ప్రయోగాత్మకంగా ఆడేందుకు 45 మంది ఆటగాళ్లను ఎంపిక చేయాలంటూ దిలీప్ ట్రోపీ నిర్వాహకులు కోరడంతో... ఆ మేరకు ఆటగాళ్ల ఎంపిక జరగింది. ఇందులో సురేష్ రైనా స్థానం సంపాదించుకున్నాడు. దీంతో దేశంలోని 60 మంది టాప్ ప్లేయర్లలో యువీకి స్థానం దక్కనట్టైంది.

మరోవైపు ఈ మధ్య కాలంలో యువీ ఫిట్ నెస్ సామర్థ్యం తగ్గిపోయిందని... కెప్టెన్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలు ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో, యువరాజ్ కెరియర్ దాదాపు ముగిసినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News