nithin: 'లై' మూవీ భారీ నష్టానికి కారణాలివే!

నితిన్ .. మేఘా ఆకాశ్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'లై' సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు 32 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 9.45 కోట్ల షేర్ ను .. 17 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టగలిగింది.

 స్టైలిష్ మేకింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా, కథా కథనాల విషయంలో బలహీనపడిపోయింది. ఒక్క యూత్ నే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ను థియేటర్స్ కి రప్పించలేకపోయింది. ఇక 'నేనే రాజు నేనే మంత్రి' .. 'జయ జానకి నాయక' వంటి భారీ అంచనాలతో వచ్చిన సినిమాలతో పోటీపడింది. ఇవన్నీ కూడా ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోవడానికీ .. అతి తక్కువ వసూళ్లను రాబట్టడానికి కారణాలయ్యాయని ట్రేడ్ వర్గాల కథనం.  
nithin
megha akash

More Telugu News