pavan: పవన్ మూవీ మ్యూజిక్ కోసం భారీగా ఖర్చు పెట్టిస్తున్న అనిరుధ్!

షార్ట్స్‌లో చూడండి
త్రివిక్రమ్ 'అ ఆ' సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన అనిరుధ్ ఆ ప్రాజెక్టుకు పనిచేయలేకపోయాడు. ఆ తరువాత పవన్ తో చేస్తోన్న సినిమాకి కూడా ఆయన అనిరుధ్ కే ఛాన్స్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ కి ఇది 25వ సినిమా అనీ .. తమ కాంబినేషన్లో వస్తోన్న మూడవ సినిమా అని అనిరుధ్ కి త్రివిక్రమ్ చెప్పారట. దాంతో మ్యూజిక్ విషయంలో అనిరుధ్ మరింత కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా కీ బోర్డు పైనే చాలా రకాల వాయిద్యాలను పలికించవచ్చు. కానీ ఏ శబ్దానికైనా ఒరిజినల్ వాయిద్యాన్ని వాడటం అనిరుధ్ కి మొదటి నుంచి అలవాటు. అందువలన ఆయన అన్ని రకాలుగా ఒరిజినల్ వాయిద్యాలనే ఉపయోగిస్తూ ఉంటాడు. అయితే ఈ పద్ధతిలో ఎక్కువ మంది వాయిద్యకారులు పనిచేయవలసి వస్తుంది గనుక ఖర్చు భారీగా అవుతోందట. అయినా దర్శక నిర్మాతలు వెనుకాడటం లేదని చెప్పుకుంటున్నారు.  
Go Back to Shorts
pavan
keerthi

More Telugu News