: ఫ్లిప్‌కార్ట్ లో ఐదు రోజులపాటు భారీ డిస్కౌంట్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ 24 వరకు తన నాలుగో ఎడిషన్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించబోతోంది. తాము విక్రయించే అన్ని కేటగిరీల్లోని ఉత్పత్తులపై ఇప్పటివరకూ అందించని విధంగా బెస్ట్ డీల్స్‌ను అందిస్తున్నామని తెలిపింది. ఆయా ఉత్పత్తులపై 90 శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తామని పేర్కొంది. 80 ప్లస్ కేటగిరీల్లో ఎక్స్‌క్లూజివ్ సెలక్షన్, దిగ్గజ బ్రాండులతో ఎక్స్‌క్లూజివ్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు, అలాగే టీవీ, రేడియో, సోషల్ మీడియా, అవుట్డోర్స్, డిజిటల్ మీడియా వంటి వాటిల్లో ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ గురించి తాము మార్కెటింగ్ క్యాంపెయిన్‌ను కూడా నిర్వహిస్తామని చెప్పింది. పండుగ షాపింగ్ ను దృష్టిలో పెట్టుకుని బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.