: డేరా బాబా దత్త పుత్రిక దేశం విడిచి వెళ్లిపోయిందా?
రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరా బాబా జైల్లో ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అతని దత్తపుత్రికగా చెప్పుకునే హనీ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆమె ఎక్కడున్నా పట్టుకుంటామని హర్యాణా డీజీపీ చెబుతున్నప్పటికీ... వారం రోజులు గడచినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె కోసం ముంబైతో పాటు, నేపాల్ బోర్డర్ లో కూడా వేట కొనసాగుతోంది. గుర్మీత్ ను దోషిగా కోర్టు నిర్ధారించిన తర్వాత... అతన్ని తప్పించేందుకు హనీ ప్రీత్ ప్రయత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ అయింది. మరోవైపు ఆమె ఇప్పటికే దేశాన్ని విడిచి వెళ్లిందని పోలీసులు భావిస్తున్నారు.