: అబూ సలేంకు ఉరిశిక్ష విధించలేకపోవడానికి కారణమిదే!
ముంబైపై విరుచుకుపడి, 257 మంది అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన బెట్టుకున్న కేసులో ఉగ్రవాది, కీలక నిందితుడు అబూ సలేంకు మరణశిక్ష విధించాల్సి వున్నా, కొన్ని అనివార్య కారణాలతో న్యాయమూర్తులు ఆ పని చేయలేకపోయారు. అత్యంత తీవ్రమైన నేరం చేసినప్పటికీ, గరిష్ఠ శిక్ష వేయలేకున్నట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.
వాస్తవానికి ముంబై పేలుళ్ల అనంతరం అబూసలేం పోర్చుగల్ పారిపోయి అక్కడే ఉన్నాడు. ఆపై నటి మోనికా బేడీతో సహజీవనం చేశాడు. వీరిద్దరినీ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేసిన అనంతరం, పోర్చుగల్ తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు భారత అధికారులు వారిద్దరినీ ఇండియాకు తీసుకువచ్చారు. పోర్చుగల్ లో ఎటువంటి నేరానికైనా మరణదండన లేదు. పైగా, అబూసలేంను అప్పగించే వేళ, అతనికి మరణదండన విధించబోమని భారత్ హామీ ఇచ్చింది. ఈ కారణంతోనే అతనికి యావజ్జీవ శిక్షతోనే సరిపెట్టాల్సి వచ్చిందని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది వెల్లడించారు. కాగా, ఈ తీర్పుపై బాధిత కుటుంబాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.