: డేరా బాబా నాకు మంచి స్నేహితుడు: రాఖీ సావంత్
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ తనకు మంచి స్నేహితుడని బాలివుడ్ శృంగార తార రాఖీ సావంత్ తెలిపింది. బాబాకు శిక్ష పడటం తనను బాధించిందని... గణేష్ మహరాజ్ దయవల్ల కేసు నుంచి ఆయనకు విముక్తి కలగాలని కోరుకుంది. గుర్మీత్ సింగ్ కు విముక్తి కలిగితే... తనకు ఒక మంచి సినిమా ఛాన్స్ దక్కుతుందని తెలిపింది. గతంలో గుర్మీత్ సింగ్ కు చెందిన ఓ సినిమా సక్సెస్ పార్టీలో రాఖీ సందడి చేసింది. ఆ సందర్భంగా డేరాబాబాతో సెల్ఫీ కూడా దిగింది. బాలీవుడ్ ప్రముఖులు హృతిక్ రోషన్, అనిల్ కపూర్, జాన్ అబ్రహాం, శిల్పాశెట్టి, శేఖర్ సుమన్ లతో కూడా డేరా బాబాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.