: హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పై పరిణీతి చోప్రా స్పందన
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా డేటింగ్ చేస్తోందనే వార్తలు గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై పరిణీతి స్పందించింది. తాను సింగిల్ గా ఉన్నానా? లేదా? అనే విషయంపై ఇప్పుడు చర్చ అనవసరమని చెప్పిన పరిణీతి... హార్ధిక్ పాండ్యాతో మాత్రం డేటింగ్ లో లేనని తెలిపింది. పాండ్యాతో డేటింగ్ చేస్తున్నాననే వార్తలను ఇంతకు ముందే తాను విన్నానని చెప్పింది. ఈ వార్తలన్నీ అబద్ధమని తెలిపింది. ఈ విషయం గురించి తన స్నేహితులు కూడా తనను ప్రశ్నిస్తున్నారని... ఇది తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పింది.