: మరో రెండు కొత్త ఫీచర్లు తీసుకువచ్చిన `ట్రూ కాలర్`
అపరిచిత నంబర్ల వివరాలను తెలియజేసే `ట్రూ కాలర్` యాప్ గురించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతలా ప్రాచుర్యం పొందిన ఈ యాప్ భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా మరో రెండు కొత్త సదుపాయాలను తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్‌లో వెర్షన్ 8.45 అప్‌డేట్‌లో భాగంగా నంబర్ స్కానర్, ఫాస్ట్ ట్రాక్ నంబర్స్ ఫీచర్లను `ట్రూ కాలర్` పరిచయం చేసింది. నంబర్ స్కానర్ ద్వారా విజిటింగ్ కార్డులు, షాపింగ్ బ్యాగులు, అడ్వర్టైజింగ్ బోర్డుల మీద ఫోన్ నంబర్లను డైరెక్ట్‌గా స్కాన్ చేసి, ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా సెల్ నంబర్‌ను స్కాన్ చేసి, ఫోన్‌బుక్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. దీంతో మాన్యువల్‌గా నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫాస్ట్‌ట్రాక్ నంబర్స్ సౌకర్యం ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్, ఎమర్జెన్సీ నంబర్స్‌తో పాటు ఇతర ప్రాథమిక సౌకర్యాలకు సంబంధించిన నెంబర్లను `ట్రూ కాలర్` అందుబాటులో ఉంచనుంది. ఈ సదుపాయాన్ని ఇంటర్నెట్ లేనపుడు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది.