: హీరో ప్రభాస్ కొత్త బిజినెస్.. రూ. 40 కోట్ల పెట్టుబడి!
'బాహుబలి' సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్... సరికొత్త బిజెనెస్ కు శ్రీకారం చుట్టాడు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు థియేటర్ల మల్టీ కాంప్లెక్స్, ఆ ఆవరణలోనే రెస్టారెంట్లు, చిన్న పిల్లలకు వివిధ రకాల ఆటల విభాగాలు ఏర్పాటు చేస్తున్నాడు.
ఈ మూడు థియేటర్లలో ఒక దానిలో దేశంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి 106 అడుగుల త్రీడీ ఎఫెక్ట్స్ తో కూడిన భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నాడు. ఇందులో 670 సీట్లు ఉంటాయి. మిగిలిన థియేటర్లలో 170 చొప్పున సీట్లు ఉంటాయి. ఈ నిర్మాణాన్ని రూ. 40 కోట్లతో నిర్మిస్తున్నాడు. 2018 తొలి త్రైమాసికంలో వీటిని ప్రారంభించేందుకు ప్రభాస్ సన్నాహకాలు చేసుకుంటున్నాడు. ఇది పూర్తయ్యాక అక్కడే ఓ భారీ కల్యాణ మంటపాన్ని నిర్మించబోతున్నాడని సమాచారం.