: ముంబై దొంగను ఢిల్లీలో పట్టించిన సెల్పీ!

ముంబైలో దొంగతనం చేసి ఢిల్లీ పారిపోయిన దొంగను సెల్పీ పట్టించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబైలో సొంకర్ అనే వ్యక్తి సేల్స్ మన్ గా పని చేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసమో, లేక జల్సాల కోసమో కానీ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఒక మహిళ ఇంట్లో చొరబడి 32 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అనంతరం పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ముంబై ఎయిర్ పోర్టులో విమానం ఎక్కి ఢిల్లీలోని బంధువుల ఇంటికి చేరాడు.

 అయితే విమానం ఎక్కడం అదే తొలిసారి కావడంతో ఆ ప్రయాణాన్ని చిరకాలం గుర్తుంచుకునేందుకు దాని పక్కన నిలబడి సెల్ఫీ తీసుకున్నాడు. దీనిని తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేశాడు. అయితే అప్పటికే ఈ కేసును ఛేదించిన పోలీసులు, సొంకర్ కోసం గాలింపు చేపట్టారు. సొంకర్ పోస్టు చేసిన సెల్ఫీలో ముంబై ఎయిర్‌ పోర్టు, విమానం నంబరు కనిపించడంతో ఢిల్లీ వెళ్లి తలదాచుకున్నాడని గుర్తించి, అతనిని అరెస్టు చేశారు. అతని నుంచి 7 లక్షల రూపాయల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. 

More Telugu News