: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మరికాసేపట్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ రోజు 7 గంటలకే ప్రారంభం కావల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. ఐసీసీ టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుతం భారత్ 5 వ స్థానంలో ఉండగా, శ్రీలంక 8వ స్థానంలో ఉంది. శ్రీలంక టూర్‌లో భాగంగా జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన ఈ ఏకైక టీ20లో గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.